ఇకో-సెన్సిటివ్ జోన్‌కు సంబంధించి S C డైరెక్టివ్ ‘సరైన సలహా మేరకు జారీ చేయబడలేదు’ : మాధవ గాడ్గిల్

పరిరక్షణ చర్యలను అటవీ శాఖ కాకుండా, స్థానిక కమ్యూనిటీల ప్రజలు చేపట్టాలి అన్నిది ఈ ప్రముఖ పర్యావరణవేత్త ఉద్ధేశ్యం
Trivandrum / June 23, 2022

తిరువనంతపురం,జూన్ 23: అన్ని రక్షిత ప్రాంతాలు, వైల్డ్‌లైఫ్ సాంక్చువరీలు అలాగే జాతీయ పార్క్‌ల చుట్టూ కనీసం ఒక కిలోమీటరు ఇకో-సెన్సిటివ్ జోన్ (ESZ) ఉండాలని ఇటీవల సుప్రీం కోర్డ్ ఇచ్చిన ఆదేశం సరైన సలహాలపై ఆధారంగా తీసుకున్నది కాదు అలాగే అపోహల ఆధారంగా తీసుకున్నది అని ప్రముఖ పర్యావరణ వేత్త మాధవ గాడ్గిల్ అన్నారు.

దీనికి బదులు మంచి నీటి పర్యావరణ వ్యవస్థలను రక్షించాల్సిన ఆవశ్యకతను ఈ న్యాయ ఆదేశం ద్వారా దృఢంగా తెలియచేస్తే బాగుండేది అని, దేశం మొత్తం మీద పర్యావరణ పరిరక్షణ లోపాభూయిష్టంగా ఉంది అని శ్రీ గాడ్గిల్ మనోరమా ఇయర్‌బుక్ ఆన్‌లైన్‌తో అన్నారు.

తాను నాయకత్వం వహించిన వెస్టర్న్ ఘాట్ ఎకోలజీ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ రిపోర్ట్ (గాడ్గిల్ రిపోర్ట్ అని అంటారు) ప్రస్తావిస్తూ, ప్రస్తుతం వివాదస్పదం అయిన ఎకోలాజికల్ సెన్సిటివిటీని ప్రతీ సందర్భంలో ఒక్కొక్క విధంగా నిర్వచించాల్సి ఉంటుంది అని అన్నారు శ్రీ గాడ్గిల్.

“ప్రాంతాలను అక్కడి పరిస్థితులను బట్టి అత్యధిక, మధ్యస్థ మరియు తక్కువ స్థాయి సెన్సిటివిటీ ప్రాంతాలుగా విభజించి, వాటికి తగిన విధంగా రక్షణ ఏర్పాటు చేయాలని అన్నారు. టోపోగ్రఫీ, ఎలివేషన్, వర్షపాతం, సహజ ఆవాసాలు, వృక్ష సంపద అలాగే ఇతర కారకాల ఆధారంగా కూడా నిర్ణయం తీసుకోవాలి. దురదృష్టవాశాత్తు, పట్టణ ప్రాంతాలలో ఉండే పర్యావరణ పరిరక్షకులకు వాస్తవిక పరిస్థితులపై అవగాహన లేదు అని విచారం వ్యక్తం చేసారు.

అత్యంత ప్రమాదంలో ఉన్న ప్రాంతాలు అలాగే జీవవైవిధ్య అంశాలను సరైన రీతిలో రక్షించాలి అని చెప్తూ, ప్రధాన మంత్రి సైంటిఫిక్ ఎడ్వైజరీ కౌన్సిల్ ఒకప్పటి సభ్యులు అయిన గాడ్గిల్, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే మంచినీటి జీవావరణ వ్యవస్థలను రక్షించడం అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన విషయం అని చెప్పారు.

“ప్రస్తుతం తక్షణం రక్షణ అవసరమైన వ్యవస్థలు నదీ ప్రవాహాలు, సరస్సులు మరియు వెట్ ల్యాండ్లు. బహిరంగ, నిస్సార ప్రాంతాలు మరియు కుంచె అడవులకు తర్వాత ప్రధాన్యత. సతత హరిత మరియు ఆకురాల్చే అడవులకు అంత ప్రమాదం లేదు, కాబట్టి తక్షణమే పరిరక్షణ అవసరం లేదు,” అని చెప్పారు.

రక్షణ ఎక్కడ ఇవ్వాలి అనే నిర్ణయం లోపాభూయిష్టంగా ఉండగా, ఏజెన్సీ (అడవి శాఖ) ఆ బాధ్యత తీసుకోవడం అనేది మరింత తప్పుడు నిర్ణయం అని సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్స్ స్థాపకులు అన్నారు.

అత్యున్నత న్యాయస్థానం, రక్షిత ప్రాంతాలు, ప్రత్యేకించి వైల్డ్ లైఫ్ సాంక్చువరీలు, నేషనల్ పార్క్‌లు అలాగే రిజర్వ్ చేయబడిన అడవులు సహజ, జీవావరణ మరియు పర్యావరణ వైవిధ్యాలను, ఆశ్వాసాలను కాపాడుతాయి అని అలాగే పరిరక్షణకు అటవీశాఖ సరైనది అనే ఆలోచనలో ఉంది అని గాడ్గిల్ అన్నారు. “నా ఉద్దేశ్యంలో రెండు కూడా చాలా తప్పు ఆలోచనలు,” అని అన్నారు.

పరిరక్షణ అనేది సహాకార విధానంలోనే సాధ్యం అవుతుంది అనే విషయాన్ని నొక్కి చెప్తూ, దీనిని చేపట్టవలసిన కీలక బాధ్యత అటవీశాఖకు కాదు, స్థానిక ప్రజలకు ఇవ్వాలి అని చెప్పారు.

“జీవవైవిధ్య చట్టం, 2002 ప్రకారం స్థానిక వ్యవస్థలను ఉపయోగించి తమ జీవ వైవిధ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలో స్థానిక ప్రజలు సూచనలు ఇవ్వడానికి మార్గదర్శకాలను కలిగి ఉంది. స్థానిక స్థాయి జీవవైవిధ్య కమిటీలు కూడా ఉండాలి,” అని ఆయన అన్నారు.
 

గాడ్గిల్, ప్రస్తుతం పొంచి ఉన్న నిజమైన ప్రమాదాలు ఏమిటి కూడా తెలుసుకోవలసిన అవసరం ఉందని చెప్పారు, అవి నీటి వనరులను ధ్వంసం చేస్తున్న అభివృద్ధి అలాగే భారతదేశ నదీ జలాలను విషంగా మారుస్తున్న కాలుష్యం అని చెప్పారు.

 

Photo Gallery