2020-21 మధ్య కాలంలో భారత్ 11,49,341 మెట్రిక్ టన్నుల సముద్రపు ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసింది

COVID, మందగించిన మార్కెట్లు, రవాణా సమస్యలు 10.88% క్షీణతకు కారణం, కానీ చివరి త్రైమాసికంలో పునరుద్ధరణ : MPEDA చైర్మన్ ఆక్వాకల్చర్ రంగం మెరుగ్గా పనిచేస్తుంది; టిలాపియా మరియు అలంకార చేపల ఎగుమతులు పెరిగా
Kochi / June 2, 2021

2020-21 ఆర్ధిక సంవత్సరంలో 43,717.26 కోట్లరూపాయల (US $ 5.96 బిలియన్) విలువైన 11,49,341 MT సముద్రఉత్పత్తులను ఎగుమతి చేసింది. మునుపటి ఎగుమతులతో పోలిస్తే ఇది కేవలం 10.88 శాతం మాత్రమే తగ్గింది, కారణం COVID మహమ్మారి మరియు మందగించిన విదేశీమార్కెట్లు భారత సముద్రపు ఆహార ఉత్పత్తులు రంగంపై తీవ్రవైన ప్రభావం చూపడమే.

యుఎస్ఎ, చైనా మరియు యూరోపియన్ యూనియన్ (ఇయు) ప్రధాన దిగుమతిదారులుగా ఉండగా, ఘనీభవించిన  రొయ్యలు ప్రధాన ఎగుమతి వస్తువుగా దాని స్థానాన్ని నిలుపుకున్నాయి, రెండవ స్థానంలో ఘనీభవించిన చేపలు నిలిచాయి.

2019-20లో భారతదేశం రూ .46,662.85 కోట్ల (US $ 6.68 బిలియన్) విలువైన 12,89,651 మెట్రిక్ టన్నుల సముద్రపు ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసింది. 2020-21లో 6.31 శాతం మరియు డాలర్ విలువలో 10.81 శాతం క్షీణించింది.

సంవత్సరంలోని మొదటి భాగంలో ఈ COVID మహమ్మారి సముద్రపు ఆహార ఉత్పత్తుల ఎగుమతులను తీవ్రంగా ప్రభావితం చేసింది, కాని ఇది 2020-21 చివరి త్రైమాసికంలో బాగా పుంజుకుంది. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆక్వాకల్చర్ రంగం 67.99 శాతం ఎగుమతి చేసిన వస్తువులను డాలర్ పరంగా మరియు 46.45 శాతం పరిమాణంలో అందించడం ద్వారా మెరుగైన పనితీరును కనబరిచింది, ఇది 2019-20తో పోలిస్తే వరుసగా 4.41 శాతం మరియు 2.48 శాతం ఎక్కువ. అని సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపిడిఎ) చైర్మన్ మిస్టర్ కె ఎస్ శ్రీనివాస్ అన్నారు.

ఘనీభవించిన రొయ్యలు 51.36 శాతం పరిమాణంలో ఎగుమతిచేసి, 74.31 శాతం డాలర్ ఆదాయాన్ని పొందాయి. అతి పెద్ద దిగుమతిదారుడిగా  USA (2,72,041 MT) దిగుమతి చేసుకోగా,  చైనా (1,01,846 MT),  EU (70,133 MT),  జపాన్ (40,502 MT),  సౌత్ఈస్ట్ఏషియా (38,389 MT), మరియు మిడిల్ ఈస్ట్(29,108 MT) చొప్పున దిగుమతి చేసుకున్నాయి.

 

ఏదేమైనా రొయ్యల ఎగుమతులు డాలర్ విలువ ప్రకారం 9.47 శాతం, పరిమాణంలో 9.50 శాతం క్షీణించాయి.  మొత్తానికి 4,426.19 మిలియన్ డాలర్ల విలువైన 5,90,275 MT రొయ్యలు ఎగుమతి చేయడం జరిగింది. 2020-21 లో వన్నామీ (వైట్‌లెగ్) రొయ్యల ఎగుమతి 5,12,204 MT నుండి 4,92,271 MT లకు పడిపోయింది. వన్నామీ రొయ్యలు 56.37 శాతం USA కు ఎగుమతి చేయగా, చైనా  (15.13 శాతం), EU (7.83 శాతం), సౌత్ ఈస్ట్ ఏషియా (5.76 శాతం), జపాన్ (4.96 శాతం) మరియు మిడిల్ ఈస్ట్ (3.59 శాతం) ఎగుమతి చేయడం జరిగింది.

బ్లాక్ టైగర్ (పినియస్ మోనోడాన్) రొయ్యల ప్రధాన మార్కెట్ అయిన జపాన్, డాలర్ పరంగా 39.68 శాతం వాటాను కలిగి ఉంది, తరువాత యుఎస్ఎ (26.03 శాతం), సౌత్ ఈస్ట్ ఆసియా (9.32 శాతం), ఇయు (8.95%), మిడిల్ ఈస్ట్ (6.04 శాతం), చైనా (3.76 శాతం).

ఘనీభవించిన చేపలు, పరిమాణంలో 16.37 శాతం మరియు డాలర్ ఆదాయంలో 6.75 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే పరిమాణంలో 15.76 శాతం మరియు డాలర్ పరంగా  21.67 శాతం ఎగుమతులు క్షీణించి, ఎగుమతుల వరుసలో రెండవస్థానాన్ని నిలుపుకున్నాయి.

మూడవస్థానంలో నిలిచిన 'ఇతరఉత్పత్తులు' సురిమి (ఫిష్ పేస్ట్) మరియు సురిమి అనలాగ్ (అనుకరణ) ఉత్పత్తులు పరిమాణంలో 0.12 శాతం మరియు రూపాయి విలువ ప్రకారం 0.26 శాతం స్వల్ప వృద్ధిని చూపినప్పటికీ, డాలర్ పరంగా  5.02 శాతం క్షీణించాయి.

ఘనీభవించిన స్క్విడ్ మరియు కటిల్ ఫిష్ ఎగుమతులు వరుసగా 30.19 శాతం మరియు 16.38 శాతం తగ్గాయి. అయితే, ఎండు చేపలు వరుసగా 1.47 శాతం మరియు పరిమాణం మరియు రూపాయి విలువలో 17 శాతం ఎగుమతులు పెరిగాయి.

ఈ COVID మహమ్మారి సమయంలో ఎయిర్ కార్గో కనెక్టివిటీ తగ్గిపోవడంతో శీతలీకరించబడిన వస్తువులు, తాజా ఉత్పత్తుల రవాణా అనేది పరిమాణంలో 16.89 శాతం, 39.91 శాతం చొప్పున పడిపోయింది.

క్యాప్చర్ ఫిషరీస్ సహకారం పరిమాణంలో 56.03 శాతం నుండి 53.55 శాతానికి మరియు డాలర్ విలువలో 36.42 శాతం నుండి 32.01 శాతానికి తగ్గింది. ఏదేమైనా, టిలాపియా మరియు అలంకార చేపలు 55.83 శాతం మరియు 66.55 శాతం పరిమాణంలో పెరుగుదల మరియు డాలర్ ఆదాయంలో వరుసగా 38.07 శాతం మరియు 14.63 శాతం పెరిగాయి. ట్యూనా పరిమాణంలో 14.6 శాతం పెరుగుదలను చూపించింది, అయితే దాని డాలర్ ఆదాయాలు 7.39 శాతం తగ్గాయి. పీత మరియు స్కాంపి ఎగుమతులు పరిమాణం మరియు విలువ పరంగా తగ్గాయి.

యుఎస్ఎ 2,91,948 మెట్రిక్ టన్నుల దిగుమతులతో, డాలర్ పరంగా 41.15 శాతం వాటాతో భారతీయ ప్రధాన సముద్ర ఆహారపు దిగుమతిదారుగా కొనసాగుతోంది. ఆ దేశానికి ఎగుమతులు రూపాయి విలువలో 0.48% పెరిగినప్పటికీ, పరిమాణం మరియు డాలర్ పరంగా వరుసగా 4.34 శాతం మరియు 4.35 శాతం ఎగుమతులు తగ్గాయి. ఘనీభవించిన రొయ్యలు యుఎస్ఎకు ఎగుమతి చేసిన ప్రధాన వస్తువుగా ఉండగా, వన్నామీ రొయ్యల ఎగుమతులు 6.75 శాతం పరిమాణంలో పెరిగాయి. అయినప్పటికీ, బ్లాక్ టైగర్ రొయ్యల దిగుమతి వరుసగా 70.96 శాతం మరియు పరిమాణం మరియు డాలర్ పరంగా 65.24 శాతం తగ్గింది.

939.17 మిలియన్ డాలర్ల విలువైన 2,18,343 మెట్రిక్ టన్నుల సముద్ర ఆహారాన్ని దిగుమతి చేసుకున్న చైనా, డాలర్ ఆదాయంలో 15.77 శాతం, పరిమాణ పరంగా 19 శాతం వాటాతో రెండవ అతిపెద్ద మార్కెట్గా నిలిచింది. అయితే, ఈ దేశానికి ఎగుమతులు వరుసగా 33.73 శాతం, పరిమాణం మరియు డాలర్ పరంగా 31.68 శాతం తగ్గాయి. ఘనీభవించిన రొయ్యలు చైనాకు ఎగుమతుల్లో ప్రధానమైనవి, పరిమాణంలో 46.64 శాతం, డాలర్ ఆదాయంలో 61.87 శాతం వాటా ఉంది.

డాలర్ విలువలో 13.80 శాతం వాటాతో మూడవ స్థానంలో నిలిచిన EU,  ఘనీభవించిన రొయ్యలను ప్రధాన వస్తువుగా దిగుమతి చేసుకుంది. ఏదేమైనా,  ఘనీభవించిన రొయ్యల ఎగుమతి EU దేశాలకు వరుసగా 5.27 శాతం మరియు పరిమాణం మరియు డాలర్ విలువలో 6.48 శాతం తగ్గింది.

సౌత్ ఈస్ట్ ఆసియాకు ఎగుమతులు డాలర్ విలువలో 11.17 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే, ఇది పరిమాణంలో 2.56 శాతం, డాలర్ ఆదాయంలో 5.73 శాతం తగ్గింది. డాలర్ పరంగా 6.92 శాతం వాటా కలిగిన ఐదవ అతిపెద్ద దిగుమతిదారు అయిన జపాన్కు ఎగుమతులు 10.52 శాతం పరిమాణంలో పెరిగాయి కాని డాలర్ విలువలో 2.42 శాతం తగ్గాయి.

డాలర్ విలువలో 4.22 శాతం వాటా కలిగిన ఆరవ అతిపెద్ద గమ్యస్థానమైన మిడిల్ ఈస్ట్ వరుసగా 15.30 శాతం, పరిమాణం మరియు డాలర్ పరంగా 15.51 శాతం క్షీణించింది. ఘనీభవించిన రొయ్యలు ఎగుమతుల్లో ప్రధానమైనవి, డాలర్ పరంగా 72.23 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

ఈ COVID మహమ్మారి ప్రభావంతో పాటు, అనేక ఇతర అంశాలు 2020-21 మధ్యకాలంలో సముద్రపు ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రతికూలంగా ప్రభావితం చేశాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపిడిఎ) చైర్మన్ మిస్టర్ కె ఎస్ శ్రీనివాస్ అన్నారు. తక్కువ ఫిషింగ్ రోజులు, నెమ్మదిగా లాజిస్టిక్ కదలికలు మరియు మార్కెట్ అనిశ్చితుల కారణంగా ఉత్పత్తి వైపు, చేపల ల్యాండింగ్ తగ్గింది. ఫిషింగ్ మరియు ప్రాసెసింగ్ ప్లాంట్లలో కార్మికుల కొరత, ఓడరేవులలో కంటైనర్ల కొరత, పెరిగిన విమాన సరుకు రవాణా ఛార్జీలు మరియు పరిమిత విమాన లభ్యత ఎగుమతులను ప్రభావితం చేశాయి, ముఖ్యంగా శీతల తాజా ఉత్పత్తుల ఖర్చు పెరగడం వంటి విషయాలు వాటిపై తీవ్రంగా ప్రభావితం చూపాయి.

విదేశీ మార్కెట్లో పరిస్థితి మరొక విధంగా ఉంది. చైనాలో, కంటైనర్ కొరత, పెరిగిన సరుకు రవాణా ఛార్జీలు మరియు సముద్ర ఆహార ఉత్పత్తులపై COVID పరీక్ష మార్కెట్ అనిశ్చితికి కారణమయ్యాయి. USA లో, కంటైనర్ల కొరత ఎగుమతిదారులకు సకాలంలో ఆర్డర్లు అమలు చేయడం కష్టతరం చేసింది. హోరెకా (హోటల్, రెస్టారెంట్ మరియు కేఫ్) విభాగాన్ని మూసివేయడం కూడా డిమాండ్ను ప్రభావితం చేసింది. జపాన్ మరియు EU లలో, COVID ప్రేరిత లాక్డౌన్లు రిటైల్, రెస్టారెంట్, సూపర్ మార్కెట్ మరియు హోటల్ వినియోగం మందగించాయి.

Photo Gallery

+
Content
+
Content
+
Content